Sunday 23 March 2014

భగత్‌సింగ్ నాస్తికుడు కాదు, పూర్తి ఆస్తికుడు.

23 మార్చి, భారతీయ యోధులు, అమరవీరులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్, భగత్‌సింగ్‌లను ఉరితీసిన రోజు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం సాధించడానికి సరిగ్గా 90 సంవత్సరాలకు పూర్వం 1857లో భారతీయులు ఆంగ్లేయులకు ఎదురు చేసి, ఆంగ్లేయుల తలలు నరికి, 300 పట్టణాలకు స్వాతంత్రం సాధించగలిగారు. ఇది భారతీయ తొలి స్వాతంత్ర సంగ్రామం. కానీ స్వార్ధపరులైన కొందరు రాజుల కారణంగా భారతదేశం తిరిగి తెల్లదోరల పాలనలోకి వెళ్ళిపోయింది. బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంపై అధికారం సంపాదించింది. ఈ తొలి స్వతంత్ర సంగ్రామం చూసి నివ్వెరపోయిన ఆంగ్లేయులు భారత్‌ను పాలించాలంటే, కొత్త చట్టాలను చేయాలనీ, అప్పటివార్కు దేశంలో అమలులో ఉన్న భారతీయ విద్యా విధానాన్ని నాశనం చేసి, బానిస విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. అలా భారతీయులను అణిచివేయడానికి ఆంగ్లేయులు చేసిన ఒక చట్టం ఇండియన్ పోలిస్ యాక్ట్.




ఈ దేశంలో నిరసన తెలిపినవారిని నిరంకుశంగా కొట్టినా, చావబాదినా, ఆఖరికి చంపినా, అది తప్పు కాదని చెప్తూ, తాము చేస్తున్నా అత్యాచారాలను, అఘాయిత్యాలను, అక్రమాలను చట్టం మాటున సక్రమం చేయడమే దీని లక్ష్యం.

అటు తరువాత భారతదేశంలో కొత్తగా చేయాల్సిన చట్టాల గురించి అధ్యయనం కోసం సైమన్ కమీషన్‌ను నియమించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ కమీషన్‌కు వ్యతిరేకంగా స్వాతంత్ర సమరయోధులలో ప్రముఖుడైన లాలా లజపతి రాయి గారి ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రజలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. అక్కడున్న పోలీసు అధికారి లాలాలజపతిరాయ్ గారిపై దారుణంగా దాడి చేశారు. లాఠీతో తలపి బాదారు. ఒక్కసారి కాదు, దాదాపు 14-15 సార్లు, రాయ్ గారి తలపగిలేవరకు. రాయి్‌గారిని ఆసుపత్రికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది, వారు మరణించారు. ఈ సంఘటన చూసిన భగత్‌సింగ్ బాధపడి, ఆ పోలీసు అధికారిపై వర్య తీసుకోమని కోర్టులో కేసు వేశాడు. ఎవరైనా మనిషిని శరీరం మీద కొడతారు కానీ, తలపై లాఠీతో కొట్టడం తప్పని భగత్‌సింగ్ వాదించినా, చట్టం ప్రకారం పోలీసులు ఏమైనా చేయచ్చు, అందులో తప్పులేదని కోర్టు తీర్పు ఇచ్చి, ఆ సదరు అధికారి నిర్దోషి అని ప్రకటించింది.

కోర్టు న్యాయం చేయకపోతేనేమి, నేను చేస్తాను అని యువుకుడైన భగత్‌సింగ్ ఆ అధికారిని చంపేశాడు. అటు తరువాత చాలా జరిగింది, భగత్‌సింగ్‌కు ఉరుశిక్ష విధించారు. ఉరి శిక్షకు గురైన భగత్‌సిగ్‌ను కలవడానికి అనేకమంది జనం జైలుకు వస్తూండేవారు. వారితో భగత్‌సింగ్ చెప్పిన ఆఖరి కోరిక 'నేను ఎలాగో మరణిన్సితున్నాను, ఈ దేశానికి స్వతంత్రం వచ్చేలోపు అనేక మంది భారతీయుల మరణాలకు కారణమైన ఈ ఇండియన్ పోలిస్ యాక్ట్ చట్టాన్ని తొలగించాలి' అని కోరుకున్నాడు. భారత్‌కు స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా అదే చట్టం దేశంలో అమలవుతోంది. కనీసం సవరణలు కూడా చేయలేదు మన పాలకులు. ఇదా మనం భగత్‌సింగ్‌కు ఇచ్చే నివాళి?

సేకరణ: శ్రీ రాజీవ్ దీక్షిత్‌గారి ఉపన్యాసం

భగత్‌సింగ్ గురించి మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. భగత్‌సింగ్ కమ్యూనిస్ట్ కాదు. కమ్యూనిస్టులే భగత్‌సింగ్‌ను హిజాక్ చేశారు, గాంధీని కాంగ్రెస్ హైజాక్ చేసినట్టు........... మన రాష్ట్రానికి చెందిన ఒక ఐ.పీ.యస్. ఈ విషయమై తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆయన భగత్‌సింగ్ కుటుంబ సభ్యునితో మాట్లడి తెలుసుకున్న విషయం ఏమిటంటే భగత్‌సింగ్‌లో జాతీయవాదానికి కారణం మాన్యులు, ఆర్యసమాజ స్థాపకులు మహర్షి దయానంద్ సరస్వతి గారని, దయానందుని స్వతంత్ర కాంక్ష చేత భగత్‌సింగ్ ప్రభావితం చెందారు. ఒకరకంగా చెప్పాలంటే భగత్‌సింగ్ నాస్తికుడు కాదు, పూర్తి ఆస్తికుడు.

జోహార్ భగత్‌సింగ్
వందేమాతరం
జై హింద్

Courtesy:
Eco Ganesh

No comments:

Post a Comment