పవన్ సంధించిన బుల్లెట్లు !(దగాపడిన తెలుగు సోదరుడి మదిలో ప్రశ్నలే పవన్ సంధించిన ప్రశ్నలు !(బుల్లెట్లు))
Author : Gopi Chillakuru
14/03/14: పవన్ ప్రసంగం దాదాపు రెండు గంటలు ఆద్యంతం ఎంతో హుందాగా,ఆందోళనతో కూడిన ఆవేశం గా సాగింది . తను చెప్ప దలుచుకోంది,మనసులో వున్నది నిబ్బరంగా,స్పష్టముగా హైదరాబాద్ నడిబొడ్డున చెప్పాడు . ఐదు సంవత్సరాలుగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తోడబుట్టిన అన్నయ్యని విమర్శించలేక తనలో తను పడుతున్న బాధను ఒక్క సారిగా పంచుకొన్నాడు ! తను కూడా అందరి లాగే నిస్సహయం గా ఎటూ తేల్చుకోకుండా ఉండలేక పోయాను అన్నారు .
నాకు సమాజం బాగుండాలని కోరిక కానీ ఎంపీ నో మంత్రి గానో ,ముఖ్యమంత్రి నో అవ్వాలని నాకు లేదు ఇవన్నీ నా దృష్టిలో త్రుచ్చం అని మొదటే చెప్పాడు !
సినిమారంగం వారి పై తెలంగాణా ఉద్యమ ముసుగులో జరిగిన దాడులను,నిర్మాతల ,దర్శకుల హీరోల భాదలను సున్నితంగా చెప్పకనే చెప్పాడు . తనతో వున్న ప్రాణమిత్రులు కూడా ఈ ఉద్యమ రాజకీయం వల్ల నన్ను ఆంద్రోడివి (ఇది సీమంద్ర మిత్రులందరికీ అనుభవమే) అని చేసిన లొల్లిని అపనమ్మకాన్ని కూడా పంచుకొన్నాడు .
తెరాస నేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ తెలంగాణ యాసలో ఇతర నేతలను కించ పరిచే తీరును అయన యాసలోనే ఎత్తి పొడుస్తూ "జరా ఆగరాదే నేను చెప్పింది విని మాట్లాడ రాదే" ఎలాగు ఇక మీదట మన మాటల పోరు ముందుంది కదా అని మెత్త గా మొత్తి చెప్పాడు . ఆయన పై తెలంగాణా ఉద్యమ సారధిగా తనకు గౌరవం వుంది అని ప్రకటించాడు
కల్వకుంట్ల కవితమ్మ వసూళ్ళకు కూడా లెక్కలు అడిగేశాడు చెల్లెమ్మ తో సమానం అంటూనే మర్యాదగా కడిగేసాడు .జాగ్రత్త గా ఉండకపోతే ముప్పు తప్పదు నేను ఎవరిని లెక్క చేయను అని చెప్పేసాడు .
సీమాంద్ర వాళ్ళని నాలిక కోస్తాము ,చంపుతాము నరుకుతాం అని బెదిరించే వారి పై కేసులు ఎందుకు పెట్ట లేదు ఒవైసి మీద కేసులు పెట్టిన వారికి ఇవి నేరపూరిత మాటలు అనిపించలేదా అని గట్టిగా ప్రభుత్వాన్ని (మెత్తగా వున్న BJP ని కూడ విమర్చించినట్లే ) ప్రశ్నించాడు !.
తెరాస మీద విరుసుకు పడే సంగారెడ్డి శాసన సబ్యులు జగ్గారెడ్డి ని ఉత్తమ సమైక్య వాదిగా పేర్కొని ఇటువంటి నాయకులూ తెలంగాణా కు కావాలి అని మనసులో మాట చెప్పారు (కాని అయన కాంగ్రెస్ లోనే ప్రముఖ నాయకుడిగా వున్నాడు ) . కాని లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ గారు ఉద్యమ సమయం లో రెండు ప్రాంతాల మద్య వైషమ్యాలు తొలగించడానికి చేసిన కృషిని పవన్ చెప్పక పోవడం ఆశర్యం అనిపించింది. ఎంతో అభిమాన నాయకుడు వెంకయ్య నాయుడు గారు అంటూనే, వెంకయ్య మాటల గారడిని అలవాటులో పొరబాటున తన గురించి ఆయన స్థాయి కి తగని మాటలు మాట్లాడిన వెంకయ్య ను కూడా మొత్తేసాడు !
వీ.హనుమంత రావు అతి స్వామి భక్తీ లో మాట్లాడే తెలివి తక్కువ మాటల పై విరుచుకు పడి వ్యక్తీగతం గా విమర్శిస్తే ఊరుకోను అంటూ కాంగ్రెస్ వారినే కాదు ఏ పార్టీ అయినా నన్ను వ్యక్తిగత జీవితాలను విమర్శిస్తే వోప్పుకోనని మీ వ్యక్తీగత జీవితాలను బయట పెడుతాను అని హెచ్చరించారు.
"జై రామ్ రమేష్ నీ కథలు , వేషాలు చేష్టలు చూస్తె చాలు ఢిల్లీ కాంగ్రెస్ చేసే నిస్సుగ్గు అవకాశ వాద విభజన రాజకీయాలకు నిలువెత్తు చిహ్నం నువ్వు" అంటూ ఎండగట్టాడు
పవన్ పార్టీ పెట్టి కాంగ్రెస్ లో కలుపాలన్న డిగ్గిరాజ ను తిడుతూ మీ కాంగ్రెస్ గంగా నది అనుకొంటున్నారా కలపడానికి నేనెలా కనబడుతున్నాను (నాకైతే నేను మా అన్న చిరంజీవి ని కాదు అని చెప్పినట్లు అనిపించింది ) తెలుగుజాతి ని గర్వ పడేటట్లు చేసిన వ్యక్తులను వీడు ఆంధ్రుడా ,తెలంగాణా వాడా అని ప్రశ్నించే మూర్కపు వాదులను తెలివి తక్కువ వెదవల్ని ఉతికి ఆరేసాడు .indirect గా ట్యాంక్ బండు విగ్రహాల పై జరిగిన విద్వంసపు దాడులను విమర్శించకనే విమర్శించాడు
భారతీయ సనాతన ధర్మం గురించి తనకు అర్దమై న విషయాన్ని(కమ్యునిజం భావాల నుంచి బయట పడడానికి వారు ఇంకా సనాతన ధర్మం మీద ఇంకా చాలా చదవాలి ) చెప్పి భారతీయ జనతా పార్టీ శ్రేణులను చల్ల బరిచారు .కాంగ్రెస్ పై మాత్రమే నా పోరాటం దానికి ఏ పార్టీతో నైనా కలుస్తా అని చెప్పి మిగతా పార్టీలను చల్ల బరిచాడు .
మాట్లాడితే చిరంజీవి ,నాగబాబు ,కళ్యాణ్ బాబులు మా కులం వారె అని తెగ చించు కొనే కాపు నాయకులకు కూడా మీరెవరు నాకు చెప్పడానికి నేను భారతీయుడ్ని నన్ను కులం సంఘం వాడిని చేయవద్దు అని లెంప కాయలు వేశాడు . వీళ్ళు మారుతారో లేదో గాని వీరి విపరీత తిక్కకు ముందే మందు వేసి లెక్క కుదిర్చాడు !
రాహుల్ గాంధీ చెప్పే కొత్త యువ నాయకులు అంటే కాంగ్రెస్ నేతల కొడుకులు, కూతుర్లు ,చెల్లెలు, సోదరుడు కాదని వారసత్వం రాజకీయాలు పోవాలి అని చెప్పాడు .దమ్ముంటే రాహుల్ సోనియా గాంధీలు మీ బొత్స సత్యనారాయణ విజయ నగరం లో సభ పెట్టండి అంటూ బొత్స కు గతం జరిగిన భంగపాటు ను సుతి మెత్తగా గుర్తు తెచ్చాడు.
ఇప్పుడు మతం కోసం ,ప్రాంతం కోసం ప్రాణ మిస్తారు నేను దేశం కోసం ప్రాణమిస్తాను అని చెప్పటంలో కొంచెం తడబడి భగత్ సింగ్ తరువాత దేశం కోసం మొట్ట మొదట నేనే చంపుకుంటాను అన్నాడు. ఇది ప్రసంగం లో కొంచెం దోషం అనిపించింది ఎందుకంటే దేశ సరి హద్దుల్లో యుద్ధం చేసే వారు దేనికోసం ప్రాణ మిస్తున్నారు దేశం కోసమే కదా !
BJP ని పల్లెత్తు మాట అనకుండా నరేంద్ర మోడీ పై అందరి లాగే తనకున్న గౌరవాన్ని చూపాడు దివంగత రాజశేఖర్ రెడ్డి ని ఏదో సాకుతో విమర్చించలేదు అలాగని చంద్ర బాబు గారిని వూరికే పొగడ లేదు. మాట్లాడితే పార్టీ లు మారే రాజకీయ ఆయారం గయరామ్ నాయకు లను పార్టీ లో చేర్చుకొను అని చెప్పారు టీ అర్ ఎస్ పై కూడా తీవ్రముగా విమర్సలు చేయకుండా తనపై వారు చేసిన విమర్సల పై మాత్రమె రెస్పాండ్ అయ్యి కొంత సంయమనం పాటించాడు ! చాలా ఉదాహరణలు చెప్పి సీమంద్ర వారిని తిడితే బంగారు తెలంగాణా ఎలా వస్తుందో చెప్పాలని అంటూనే నేను ప్రేమించే తెలంగాణ తో, ఆ ప్రజలతో నాకు ఎంతో సన్నీహితం వుంది అని గడియ గడియకి చెప్పాడు ఒక్క కాంగ్రెస్ ను తప్ప అందరిని మెప్పింప ప్రయత్నించాడు అన్నది నిజం ! కాకపోతే సీరియస్ గా మాట్లాడుతూ సినిమా స్టైల్ లో అప్పుడప్పుడు నవ్వటం కొంచెం అసహజం అనిపించింది .
మొత్తం మీద రాష్ట్ర విభజన జరిగిన తీరు పై తన అసంతృప్తిని చెపుతూ తెలుగు వాడి పౌరుషం చూపాడు.
ధన్యవాదములతో
గోపి చిల్లకూరు
డల్లాస్ టెక్సాస్
గోపి చిల్లకూరు
డల్లాస్ టెక్సాస్
No comments:
Post a Comment