Showing posts with label Leadership. Show all posts
Showing posts with label Leadership. Show all posts

Saturday, 22 March 2014

Remembering Bhagat Singh,Rajguru and Sukhdev

Tribute to BHAGAT SINGH, SUKHDEV AND RAJGURU, 23d MARCH Martyr's Day

భారతదేశం మరువలేని మేరు సమాన ధీరులైన భగత్ సింగ్ (28 September 1907), సుఖ్‍దేవ్, రాజ్‍గురుల వర్ధంతి నేడు !!!
On this day in 1931 Shaheed Bhagat Singh, Sukhdev Thapar and Shivram Rajguru gave their life for India's freedom.
హుసేన్‍వాలా సమీపంలో భారత-పాకిస్తాన్ సరిహద్దు వద్ద భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్‍దేవ్ ల విగ్రహాలు

1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో బ్రిటిష్‌ పాలకులు వేళకాని వేళలో రాత్రి 7.30 గంటలకు భగత్‌సింగ్‌, అతని సహచరులు రాజగురు, సుఖ్‌దేవ్‌లను ఉరికొయ్యపై ఎక్కించి ఉరి తీశారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరి శిక్ష అమలు జరపడం నేరం.

మరణించే నాటికి వీరి వయస్సు వరుసగా 24,24,23

   భగత్ సింగ్ (24) 
    సుఖ్‍దేవ్(24) 
   రాజ్‍గురు (23)   


Monday, 17 March 2014

లీడర్ -అనేవాడు ప్రత్యేకంగా పుట్టడు. ప్రత్యేకత నుంచి పుట్టుకొస్తాడు. (Leadership Qualities)

లీడర్ -అనేవాడు ప్రత్యేకంగా పుట్టడు. ప్రత్యేకత నుంచి పుట్టుకొస్తాడు. అందుకే ప్రతి ఒక్కరిలోనూ లీడర్ -అపరిచితుడిలా దాగివుంటాడు. అలాగని తన లక్ష్యసాధన కోసమే బయటపడే అపరిచితుడు లీడర్ కాలేడు. లీడర్ తన కోసం తానుగా జీవించడు. జన హృదయాల ఘోషను శాంతింపజేయడానికి పోరాడుతాడు.

ఇటీవలి కాలంలో ‘అవినీతి’పై పోరు అంబరాన్ని అంటింది. ‘అన్నాహజారే! జిందాబాద్!’ అంటూ యువ హృదయాలు ఎగిసిపడ్డాయి. స్వచ్ఛతతో మద్దతు పలికాయి. మరి ఆ లీడర్ యువకుడు కానే కాదు. అయినా దేశమంతా పోరాట స్ఫూర్తితో ఊగిపోయింది. మరీ ముఖ్యంగా యువతరంగం ఎగిసిపడింది. చివరకు ఉద్యమ ఉద్ధృతికి ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. లీడర్ ఏ వయసు వాడైనా జన హృదయాన్ని గెలిచే సత్తా వుంటే -ఆ శక్తి లీడర్‌స్థాయిని అమాంతంగా పెంచేస్తుంది. మరి లీడరే యువకుడైతే?! ఉక్కు నరాలు.. ఇనుప కండరాలతో ప్రపంచ పునాదులే కదిలిపోతాయ్.
లీడర్ కావాలంటే మొదట కావాల్సింది ‘అంకితభావన’.. సమాజానికి తనను తాను సమర్పించుకోవాలి. సమస్యల పోరాటంలో మొదట తానొక్కడే! అతను ఎంచుకున్న మార్గలు, నడత, పనితీరు మొదలైన ఎన్నో నాయకత్వ లక్షణాలు అతనికో ‘దండు’ని ఏర్పరుస్తుంది. ఆ దండు అతనికి మరింత మనోబలాన్నిస్తుంది. అదే అతడి రక్షణ. ఆయుధం. ప్రతి విషయంలో మంచి చెడు వున్నట్లే లీడర్‌షిప్‌లో కూడా మంచి చెడు వుంటుంది. మంచి లీడర్‌షిప్ నిస్వార్థంతో కలకాలం నిలిచిపోతుంది. లీడర్‌షిప్‌లో చెడు దాగివుంటే అది బయటపడేలోపు జరగాల్సినంత నష్టం జరిగిపోతుంది.
ప్రతిరంగంలో లీడర్స్ ఉద్భవిస్తూనే వుంటారు. కాని స్వచ్ఛత కలిగిన లీడర్‌షిప్పే ఎక్కువ కాలం ప్రభావితం చేస్తుంది. ఓ గాంధీ.. నెల్సన్ మండేలా.. మదర్ థెరిసా.. సద్దాం హుస్సేన్.. గఢాఫీ యిలా ఎందరో లీడర్స్. వీరిలో స్వచ్ఛమైన నాయకత్వం వున్న లీడర్స్ వున్నట్లే స్వార్థపూరిత నాయకత్వం గల లీడర్స్ కూడా వున్నారు. కాని చరిత్రలో వారి స్థానాలేమిటో మనకు తెలియంది కాదు.
లీడర్‌కి ‘్ఛరిష్మా’ కావాలంటారు. నిజమే! లీడర్‌లో వున్న అన్ని క్వాలిటీస్‌తోపాటు ఆకర్షించే శక్తి (్ఛరిష్మా) వుంటే ఆ నాయకత్వ పటిమ మరింతగా దూసుకుపోతుంది. ఛరిష్మా వుండి మిగతా క్వాలిటీస్ లేకపోయినా నాయకత్వం నడుస్తుందంటే అది పునాది లేని బిల్డింగే అవుతుంది. అలాటి నాయకునికి ‘్ఫలోయర్స్’ వుంటారేగాని సమర్థవంతమైన ‘సపోర్టర్స్’ వుండరు.
లీడర్ అనే పదానికి సరైన పవర్‌ని అందించే రంగం ‘రాజకీయం’. పరిపాలనను చేజిక్కించుకోవడానికే లీడర్స్ అవతరిస్తూ వుంటారు. ప్రజానీకానికి లీడర్ ఎక్కువగా ఈ రంగం ద్వారానే పరిచయవౌతాడు. మన దేశంలో పరిపాలన మొదలైన నాటినుండి నేటి వరకు ఉద్భవించిన లీడర్స్‌యొక్క నాయకత్వాన్ని మనం చూసాం, చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని ప్రక్కనపెట్టి ఫాలోయర్స్ అధికంగా గల వాడే లీడర్ అనే స్థాయిలో మైండ్‌ని ఫిక్స్ చేసేసుకున్నాం.
నాయకత్వ లక్షణాలు అన్నింటిని ప్రక్కన పెట్టి నలగని దుస్తులు.. చెదరని మేకప్‌లతోపాటు నిత్యం అనుచరగణంతో సంచరించేవాడే నిజమైన లీడర్ అనుకునే భ్రమలోకి జారుకున్నాం. లీడరంటే ఇలాగే వుండాలి, ఇలాగే ప్రవర్తించాలని భావిస్తున్నాం. ఈ ముసుగులో లోఫర్ కూడా లీడరై కనిపిస్తున్నాడు. నిజమైన లీడర్స్ కనుమరుగైపోతున్నారు అనుకునే తరుణంలో అన్నాహజారే వంటి వ్యక్తులు నిజమైన లీడర్స్‌గా కనిపించడం యువతకు స్ఫూర్తిని కలగజేస్తుంది.
ఎలాగైనా సాధించాలి అనుకోవడం లీడర్‌షిప్ క్వాలిటీ కాదు. సైద్ధాంతిక ప్రకారం సాధించాలని చెప్పడం కరక్టే అయినా సమస్యకు అది సరిపోవాలి. అతివాదులు.. విప్లవకారులు సైతం మన దేశస్వాతంత్య్ర సమరంలో లీడర్స్‌గా తమ సత్తాను చాటారు. కాని గాంధీజీ అహింస.. సత్యాగ్రహ సిద్ధాంతమే సమస్యకు సరిపోయింది. ఇప్పటికీ అనేక సమస్యల సాధనకై ఎందరో లీడర్స్ తమ స్టయిల్స్‌లో పోరాటం చేస్తూనే వుంటారు. కాని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలిగే శక్తి కొందరి లీడర్స్‌లోనే వుంటుంది. అలాంటి లీడర్స్ అవతరించే వరకు సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే లభిస్తాయి.
యువతలో లీడర్‌షిప్ క్వాలిటీస్ విద్యార్థి జీవితంలోనే మొదలవుతాయి. అయినా కొంతమంది మాత్రమే లీడర్స్‌గా అవతరించగలుగుతారు. మిగతావారంతా భావాలను వ్యక్తీకరించే, సమర్థించే దండుగా మిగిలిపోతారు. మంచి ఆరేటర్ (వక్త) మంచి లీడర్ కాగలడు. తన ప్రసంగాలతో ఎందరినైనా ఆకర్షించి పోరాట స్ఫూర్తిని కలిగించగలడు. మాటను మించిన ఆయుధం మరొకటి లేదు. అందుకే ‘లీడర్’ పిలుపు కోసం ఎదురుచూస్తారు. ఇలాంటి పిలుపులో బలంవుండాలంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకునే శక్తి లీడర్‌లో వుండాలి.
యువతలో నిద్రాణమైన ఉడుకునెత్తురు వుంటుంది. దానిని రగిలిస్తే ప్రళయం తప్పదు. అందుకే లీడర్ యువతకు స్ఫూర్తినిచ్చే తత్వం కలిగి వుండాలి. తన స్వార్థ ప్రయోజనాల కోసం యువతను తప్పుదోవ పట్టించే లీడర్ దండుని కోల్పోక తప్పదు. భారతదేశంలో యువ జనాభా ఎక్కువ. అలాంటప్పుడు ఎంతమంది లీడర్స్ ఉద్భవించాలి? కానీ ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఏ రంగంలోనైనా మధ్యవయసు దాటి చరమాంకంలో పడ్డవారే లీడర్స్‌గా కనిపిస్తారు. ఎందుకిలా? లీడర్‌షిప్‌ని స్వీకరించాలంటే నిశ్చలతత్వం.. అంకితభావం కావాలి.
‘ఎవరో ఒకరు ఎపుడోకపుడు పోరాడుతారులే!’ అన్నభావన నానాటికీ పెరిగిపోతుంది. లీడర్ కావాలంటే స్వార్థరహిత జీవనం అలవాటు చేసుకోవాలి. నేడు సమస్యపై స్పందించేకంటే సర్దుబాటు చేసుకోవడానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాం. అలాంటప్పుడు లీడర్ ఎలా అవతరిస్తాడు? నేడు సమాజంలో ఎన్నో రుగ్మతలు. వాటన్నింటిపట్ల ముందు స్పందించే గుణాన్ని యువత అలవాటు చేసుకోవాలి. అదే మీలో దాగున్న లీడర్‌ని మేల్కొలుపుతుంది. ఒక్కసారి మీలో లీడర్ మేల్కొన్నాక మీ లైఫ్‌స్టైలే మారిపోతుంది! ఎంత దూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. మీలోని లీడర్‌షిప్ క్వాలిటీస్ మిమ్మల్ని పదిమందిలో ఒక్కరిగా కాకుండా పదిమందికీ ఒక్కరిగా నిలబెడుతుంది. అప్పుడు మీరే లీడర్.. మీలోని అంకితభావం.. నిస్వార్థం.. నిర్మలత్వం వంటివి మీలోని లీడర్‌కి గీటురాళ్ళుగా నిలుస్తాయ.

Friday, 14 March 2014

Mahatma Gandhi Quotes- గాంధీజీ చేసిన వ్యాఖ్యలు


మహాత్ముడనీ, జాతిపిత ఆనీ పేరెన్నిక గన్న గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన వేలాది నాయకులలో అగ్రగణ్యుడు. గాంధీజీ 1869 అక్టోబర్ 2 న గుజరాత్ లోని పోరుబందర్‌లో జన్మించాడు. 1948 జనవరి 30న హత్యకు గురైనాడు.

ఆయన చేసిన వ్యాఖ్యలు...
అహింసకు మించిన ఆయుధం లేదు.
ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి.
ఆలోచనల పరిణామమే మనిషి. అతను ఎలా ఆలోచిస్తే అలా తయారౌతాడు.
కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది.
ఆత్మార్పణకు,స్వచ్చతకు నిలయం కానప్పుడు స్త్రీకి విలువ లేదు.
ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజలచేతిలోని ఆయుధాలు.
భారతీయులు తమలో తాము పోట్లాడుకోవడం మానుకున్నప్పుడే మనకు అసలైన స్వాతంత్ర్యం వస్తుంది.
మార్పునుకు సిద్ధంగా ఉండండి. అపుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు.
పాము కాటు శరీరాన్ని విషతుల్యం చేస్తుంది, అదే తాగుడు వ్యసనం ఆత్మను చంపేస్తుంది.
హక్కులకు వాస్తవమైన మూలాధారం-కర్తవ్య నిర్వహణం.మనం మన కర్తవ్య నిర్వహణ చేసినట్లయితే హక్కులు పొందేందుకు ఎంతో దూరంలో ఉండము.మన విధులు నిర్వర్తించకుండా హక్కుల కోసం పరుగెత్తినట్లయితే అవి మనల్ని దాటి పోతాయి.మనం ఎంతగా వాటిని వెంబడిస్తే అవి అంత త్వరితంగా ఎగిరిపోతాయి.
మీరు పుస్తకాలు పఠించవచ్చు.కానీ అవి మిమ్మల్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేవు.మీలోని ఉత్తమత్వాన్ని బయటికి తేవటమే నిజమైన విద్య అనిపించుకుంటుంది.మానవత్వం అనే పుస్తకం కంటే వేరొక ఉత్తమ గ్రంధం ఏమి ఉంటుంది.
    ప్రపంచం ఆధిపత్యం వహించిన పటిష్టవంతమైన శక్తి-ప్రేమ.మరియు అది వినయం గల కల్పనా రూపము.ప్రేమ ఎక్కడ ఉంటుందో,దేవుడు కూడా అక్కడే ఉంటాడు.
జీవితంలో స్వచ్చమైనవి మరియు ధార్మికమైనవి అయిన వాటన్నిటికీ స్త్రీలు ప్రత్యేక సంరక్షకులు.
    స్వభావరీత్యా మితవాదులైనందువల్ల మూఢాచారాలను విడనాడటంలో ఆలస్యం చేస్తారు. అలాగే జీవితంలో స్వచ్చమైనవి,గంభీరమైనవి వదిలి పెట్టేందుకు కూడా అలస్యం చేస్తారు.
విద్యార్థుల ఆలోచనలు, ఆచరణలు క్రమశిక్షణా సహితంగా లేకుంటే వారు చదువంతా వృధా.
ఎవరైతే చిరునవ్వుల్ని ధరించరో వారు పూర్తిగా దుస్తులు ధరించినట్లు కాదు.
ఒక అభివృద్ది చెందిన కంఠం నుండి ఉత్తమ సంగీతం సృష్టించే కళను అనేకమంది సాధించవచ్చు కానీ ఒక స్వచ్చమైన జీవితం అనే మధురస్వరము నుండి అటువంటి సంగీతకళను పెంపు చేయటం చాలా అరుదుగా జరుగుతుంది. అన్ని కళల కంటే జీవితం గొప్పది. పరిపూర్ణత్వానికి చేరువ కొచ్చిన జీవితం గల మానవుడే అత్యంత గొప్ప కళాకారుడని నేను ప్రకటిస్తాను.సౌజన్యతగల జీవితం యొక్క గట్టి పునాది లేని కళ ఏమిటి?
మన ప్రార్థన హృదయ పరిశీలన కోసం.భగవంతుని మద్దతు లేకుండా మనం నిస్సహాయులమని మనకు అది గుర్తు చేస్తుంది.దాని వెనుక భగవంతుని దీవెన లేనట్లయితే ఉత్తమమైన మానవ ప్రయత్నం కూడా నిష్పలమౌతుంది.
సత్యాగ్రహము జయమైందని ప్రజలు సంతోషించారే కాని సంపూర్ణ విజయ లక్షణాలు లోపించడం వలన నాకు సంతృప్తి కలుగలేదు.
కైరా సత్యాగ్రహం పాక్షికంగా విజయవంతం కావడంపై గాంధీ చేసిన వ్యాఖ్య
నన్ను ఢిల్లీ వాసులు పిలవడం వలన అచ్చట శాంతి నెలకొల్పడం కోసం వెళ్తున్నాను కాని అశాంతి నెలకొల్పడం కోసం కాదు.
రౌలత్ చట్టం తర్వాత జాతీయోద్యమ నాయకులు గాంధీని ఢిల్లీ రమ్మని పిలిచినప్పుడు గాంధీ ఢిల్లీ వెళ్ళగా పోలీసులు రైలు దింపినప్పుడు గాంధీ చేసిన వ్యాఖ్య.
మన అభిప్రాయాలను ఇతరులపైన బలవంతంగా రుద్దడం వలన మనం నిజమైన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోలేము.
నాగ్పూర్ భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులో గాంధీజీ వ్యాఖ్య.
మనిషిని బాధించే జంతువులను చంపకూడదని నా అభిప్రాయం కాదు. ఏది హింస, ఏది అహింస అన్నది మనుషులు తమ విచక్షణతో తెల్సుకోవాలి.
హరిజన్ పత్రికలో గాంధీ వెలిబుచ్చిన అభిప్రాయం.
నా మట్టుకు సత్యాగ్రహ ధర్మ సూత్రం ప్రేమ సూత్రం లాంటిది. ఒక అనంతమైన శాశ్వతమైన సిద్ధాంతం. సత్యాగ్రహ నియమాలు ఒక క్రమపరిణామాన్ని కలిగి ఉంటాయి.
సత్యాగ్రహ ధర్మ సూత్రం గురించి గాంధీజీ తన పుస్తకంలో వివరించిన వ్యాఖ్యలు.
ప్రజాస్వామ్య స్పూర్తిని ఇతరులెవ్వరూ బలవంతంగా రుద్దలేరు, అది అంతర్గతంగా, స్వతసిద్ధంగా వికసించాల్సి ఉంటుంది.
విద్యార్థుల ఆలోచనలు, ఆచరణలు క్రమశిక్షణా సహితంగా లేకపోతే వారి చదువంతా వృథా.
చెడును నిర్మూలించేందుకు ఆయుధాలు పడితే జరిగేది రెండు దుష్టశక్తుల మధ్య యుద్ధమే.
చదవడం వలన ప్రయోజనమేమంటే నలుమూలల నుంచీ వచ్చే విజ్ఞానాన్ని పొందడం, దాన్నుంచి గుణపాఠాలు తీసుకోవడం.
ఆచరించడం కష్టమని మూలసూత్రాలను విడిచిపెట్టకూడదు. ఓర్పుతో వాటిని ఆచరించాలి.   
                                             వందేమాతరం  

Monday, 10 March 2014

Aam Aadmi Party fourth set of candidates for the Lok Sabha elections, 2014.

The fourth list of candidates for 2014 Elections have been announced. These 61 candidates cover Delhi, Uttar Pradesh, Karnataka, Haryana & Punjab. 


Total candidates announced so far now reaches 131. 

The following tables lists the candidates

S.No.StateLS ConstituencyOur candidate
1DelhiNEW DELHIAshish Khetan
2DelhiSOUTH DELHICol Devender Sehrawat
3HaryanaAmbala (SC)SP Singh
4HaryanaBhiwaniLalit Agarwal
5HaryanaFaridabadPurshottam Dagar
6HaryanaKarnalParamjeet
7KarnatakaBangalore CentralV. Balakrishnan
8KarnatakaBangalore NorthProf Babu Mathew
9KarnatakaBangalore RuralRavikrishna Reddy
10KarnatakaBangalore SouthNina P. Nayak
11KarnatakaBidarChandrakant Kulkarni
12KarnatakaChikballapurK. Arkesh
13KarnatakaChikkodiAshfaq Ahmed Madaki
14KarnatakaDakshina KannadaM. R. Vasudeva
15KarnatakaGulbarga (SC)Dr (Mrs) B.T.Lalitha Naik
16KarnatakaHubli-DharwadHemant Kumar
17KarnatakaKolar (SC)KotiganahalliRamaiah
18KarnatakaRaichurBhimaraya
19KarnatakaShimogaG. Sridhara Kallahalla
20PunjabFaridkot (SC)Prof. Sadhu Singh
21PunjabGurdaspurSucha Singh Chottepur
22PunjabSangrurBhagwant Mann
23UPAgra (SC)Ravindra Singh
24UPAligarhSabir Rahi
25UPAmbedkar NagarKramveer Chakravarti
26UPAmrohaMullana Kalbe Rushaid
27UPAonlaNaresh Singh
28UPAzamgarhRajesh Yadav
29UPBareilySunil Kumar
30UPBHADOHIVaris Aqbal Khan
31UPBijnorDr.Gaurav Chauhan
32UPBulandshahrRahul Deepanker
33UPDEORIAArun Kumar Tripathi
34UPDOMARIYAGANJBadre Alam
35UPEtawahUjiyare Lal
36UPFatehpurJain Ul Haq
37UPFatehpur sikriMahaveer Singh Solanki
38UPGautam Budha NagarK P Singh
39UPGhazipurBrajbhushan Dubey
40UPGondaMashooq Usmani
41UPGORAKHPURProf. Radhey Mohan Mishra
42UPHAMIRPUR (UTTAR PRADESH)Atul Kumar Singh (Prajapati)
43UPHathras (SC)Sunahari Lal Taank
44UPJAUNPURDr. Kailash Prakash Yadav
45UPJhansiArchana Gupta
46UPKanpurDr. Mahmood Husain Rehmani
47UPKaushambi (SC)Dr. Shitla Prasad
48UPKUSHI NAGARAKHND PRTAP SINGH
49UPLAKHIMPURIllyas Azmi
50UPMeerutHimanshu Singh
51UPMohanlalganjSunil Gautam
52UPMuzzafarnagarMohammed Yamin
53UPNaginaSarika Choudhary
54UPPhulpurShimla Sree
55UPPilibhitRajiv Agrawal
56UPPratapgarhAshok Kumar Shukla
57UPROBERTSGANJ(SC)Ram Dhyan Bharti
58UPSalempurChandra Pratap Singh
59UPSambhalHurr Mehdi Baqri Sohail
60UPSitapurShefali Misra
61UPUnnaoArvind Kumar (Kamal)

Sunday, 9 March 2014

నూతన నాయకత్వానికి కావలసిన నవ మార్గ దర్శకాలు !

మన రాష్ట్రములోను, కేంద్రంలోను ఇది ఎన్నికల సమయం ! 

వివిధ రాజకీయ పార్టీలలో,స్వచ్చంద సంఘాలలో వారి వారి నాయకత్వ లక్షణాలను ,అదృష్టాన్ని పరీక్షించు కొనేందుకు సన్నద్దమవుతున్న చాల మంది యువకులకు(ఏ రంగములోని వారికైనా అందరికి ) ఉపయోగ పడే విధముగా స్వామి వివేకానందుల వారు వివధ సందర్బాలలో నాయకత్వం గురించి చెప్పిన మాటలుతీసి తొమ్మిది సూత్రాలుగా మార్చాను (నా కొద్ది వ్యాఖ్యనముతో) .
వీటిలో ఏ కొన్ని పాటించినా ఖచ్చితముగా మనం మంచి నాయకులం అవుతాము.



ఓటు వేసే మిత్రులు వీటిలో కనీసం 3 సూత్రాలు పాటించ గలిగే నాయకుడిని మీ ప్రాంతంలో గాని మీ నియోజక వర్గంలో గాని మీ వూరిలో గాని చూస్తే ఆ వ్యక్తీకి పార్టీలకు అతీతంగా ఓటు వేయండి కొంచెం మనశ్శాంతి కలుగుతుంది
యువ నాయకత్వానికి కావలసిన నవ మార్గ దర్శకాలు (సూత్రాలు)

1)సేవకుడే నాయకుడు (నాయకుడైన వాడు మొదట సేవకుడు గా వుండడం తెలుసుకోవాలి )

2)నాయకత్వం వహించే వాడు అపరిమిత ధైర్యము, అనంత విశ్వాసము, అఖండ సహనము కలిగి నిస్వార్ధముగా ఉండాలి.

3)విశ్వాసము ,సౌశీల్యం కలిగిన కొద్దిమంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర..!
మనకు కావలసినవి మూడు
1) ప్రేమించే మరియు స్పందించే హృదయం
2)భావించే (ఆలోచించే) మనస్సు
3)పని చేసే చెయ్యి

4)మీరందరూ వర్గ కీచులాటలను,అసూయను విడిచి పెట్టండి. భూమాతవలె ఓరిమి కలిగి వుండండి.దీనిని మీరు సాధించగలిగితే లోకమే మీకు పాదక్రాంతము అవుతుంది.

5)మిమ్మల్ని ఒక శక్తిజనకమైన యంత్రముగా తయారుచేసుకోండి..! ప్రజలు మనల్ని మంచి వారు అని, చెడ్డ వారు అని అంటారు. కాని నాయకుడు ఆదర్శాన్ని ముందుంచు కొని సింహాల్లాగా మనం పనిచేయాలి.
"ఏమన్నా కానిమ్ము..ఎవరినన్నా రానిమ్ము.. జగత్తంతా ఎదురు తిరిగినగాని.. ఒక్క అడుగైన వెనుక వేయకు".

6)ప్రతిఘటన, వ్యతిరేకత ఎంత ఎక్కువ వుంటే అంత మంచిది, ప్రతిఘటన లేనిదే నదికి వేగము రాదు.
ఒక విషయం ఎంత కొత్తదైతే, ఎంత మంచిదైతే ప్రారంభ దశలో అంత వ్యతిరేకతను ఎదుర్కొనవలసి వస్తుంది.
7) 'లోకం తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోని నేను ధర్మ మార్గాన్ని అనుసరిస్తాను" అన్నదే ధీరుని విధానము .
దానినే కొంచెం గట్టిగా ఇలా కూడా అంటారు
" త్రుచ్చులు నీ గురించి ఏమైనుకొంటే నీకేమి, ఎన్ని వ్యర్ధ ప్రేలాపనలు చేసినా కాని వారి కేసి క్రీగంటనైన చూడకు,లెక్క చేయకు"

8)పరిస్థితులు నీకు ఎంత ప్రతికూలముగా వుంటే నీలో నీవు అంత అంతర్గత శక్తిని పెంచుకోగలవు .
" సంఘం ప్రతిఘటించే కొద్ది మన శక్తీ మరింతగా వెలువడుచున్నది ".

9)హృదయం లేని మేధావులను గాని, వారి పత్రికా వ్యాసాలను గాని, వార్త పత్రికల వంచనలను పట్టిచుకోవద్దు. "చదువులేని మూర్ఖుని కంటే చదువున్న మూర్కుడు మరింత చక్కగా తన మాటలతో జనులను మరింత మోసము చేయును" (మన దేశం లో ఇలాంటి వారు ఈ మధ్య ఎక్కువ మంది తయారయ్యారు )

ధన్యవాదములతో
మీ గోపి చిల్లకూరు
డల్లాస్ టెక్సాస్